మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దారుణం.. వృద్ధుల దారుణ హత్య..
ABN , Publish Date - May 16 , 2026 | 04:26 PM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు.
రంగారెడ్డి: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వారి మృతదేహాలను పరిశీలించారు. అయితే, మృతులను తాండూరులో అదృశ్యమైన ఇద్దరు వృద్ధులుగా పోలీసులు గుర్తించారు.
వీరి వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. బాధితులను వికారాబాద్ నుంచి తీసుకొచ్చి ఫామ్‌హౌస్‌లో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫైనాన్స్ డబ్బుల విషయంలోనే వీరి హత్య జరిగినట్లు భావిస్తున్నారు. డబ్బు ఇస్తామని పిలిచి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
మంత్రుల జాబితా సిద్ధం చేస్తున్నాం, 18న ప్రమాణ స్వీకారం.. సతీశన్
ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం