Share News

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..

ABN , Publish Date - Jun 29 , 2026 | 09:13 AM

రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో బిడ్డ అనాథగా మారిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..
Rangareddy News

రంగారెడ్డి జిల్లా: మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో బిడ్డ అనాథగా మారిన ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. జన్వాడ గ్రామానికి చెందిన దంపతులు సాయి, పద్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సాయి ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా పద్మతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారి ఏడాదిన్నర కిందట వివాహం చేసుకున్నారు. వారికి ఐదు నెలల కిందటే ఓ కుమారుడు జన్మించాడు.


సాయి, పద్మ మృతితో చిన్నారి అనాథగా మిగిలిపోయాడు. అయితే, భార్యాభర్తల మృతికి ఆర్థిక సమస్యలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు జన్వాడ గ్రామానికి చేరుకున్నారు. దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన తీరును పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బలవన్మరణానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దంపతుల మృతితో జన్వాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన ఐదు నెలల చిన్నారిని చూసి గ్రామస్థులంతా కన్నీటిపర్యంతం అవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రా!

ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం..

Updated Date - Jun 29 , 2026 | 10:27 AM