Share News

బోరుబావి కోసం గొడవ.. 17 నెలల పసికందును నేలకేసి కొట్టిన దుర్మార్గుడు

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:04 PM

పరిగి మండలం సాలిపాలబాట తాండాలో దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

బోరుబావి కోసం గొడవ.. 17 నెలల పసికందును నేలకేసి కొట్టిన దుర్మార్గుడు

వికారాబాద్ జిల్లా, నవంబర్ 11: పరిగి మండలం సాలిపాలబాట తాండాలో దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బోరుబావి విషయంలో చందర్, రవి కుటుంబ సభ్యుల మధ్య గొడవ రాజుకుంది. బోరుబావి తమదంటూ రెండు వర్గాలూ వాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో బోరుబావికి చెందిన పైప్‌లైన్‌ను రవి కుటుంబ సభ్యులు కత్తిరించారు. దీనిపై వీడియో తీస్తూ చందర్, ఆయన కుమార్తె సుచిత్ర ప్రశ్నించారు. దీంతో రవి కుమారుడు తులసీరామ్ ఆగ్రహానికి గురయ్యాడు. చందర్ ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డాడు.


తులసీరామ్ చందర్‌పై, సుచిత్రపై తీవ్రంగా దాడిచేశాడు. సుచిత్ర కూతురి (17 నెలల పాప) పట్ల కూడా నిర్దయగా ప్రవర్తించాడు. ఆ నెలల పసికందును ఆగ్రహంతో దూరంగా విసిరేశాడు. దీంతో ఆమె తలకు గాయమైంది. ఈ దాడిలో చందర్‌కూ గాయలయ్యాయి. ప్రస్తుతం వీరు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పైప్ లైన్ కత్తిరించిన వ్యవహారంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు చందర్ ఆరోపిస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

హనుమకొండలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్

ఘట్‌కేసర్‌ బస్టాండ్‌లో మరుగు దొడ్ల మూసివేత

Updated Date - Nov 11 , 2026 | 03:27 PM