రంగారెడ్డి జిల్లాలో గంజాయి, తుపాకుల కలకలం.. నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:47 PM
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో గంజాయి, తుపాకులు పట్టుబడటం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ పోలీసులు సుమారు రూ.4 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 23: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో గంజాయి, తుపాకులు పట్టుబడటం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ పోలీసులు సుమారు రూ.4 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా.. నిల్వపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ పట్టివేత జరిగినట్లు తెలుస్తోంది. గంజాయితో పాటు మారణాయుధాలు కూడా వెలుగులోకి రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. పోలీసులు మూడు రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నాలుగు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక రివాల్వర్‌లో బుల్లెట్ లోడ్ చేసి ఉన్నట్లు గుర్తించారు. మారణాయుధాలతో పట్టుబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి, రివాల్వర్లు నిందితుడి వద్దకు ఎలా వచ్చాయి? వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...
భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
Read Latest AP News And Telangana News And National News