Electricity: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి కరెంట్ కట్..
ABN , Publish Date - Jan 20 , 2026 | 06:50 AM
నగరంలోని ఆయా ఏరియాల్లో మంగళవారం ఉదయం 10 గంటలనుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంబంధిత అధఇకారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఇతర కారణాలతో సరఫరాను నిలిపొవేస్తున్నట్లు తెలొపారు.
హైదరాబాద్: బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ(ADE G. Gopi) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ శ్రీనగర్ కాలనీ, శబ్దాలయ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ నాగార్జున నగర్ కాలనీ, డీకే బస్తీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
హైదర్‌నగర్: పోలీస్ స్టేషన్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అడ్డగుట్ట రోడ్డు నెంబర్ 1,2,3,4, అర్జున్ థియేటర్ రోడ్ ఫేజ్-2, భాగ్యనగర్ కాలనీలో విద్యుత్ ఉండదన్నారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటలకు జలవాయువిహార్, అడ్డగుట్ట రోడ్డు 5,6, జేఎన్‌టీయూ పోలీస్ స్టేషన్ రోడ్డులో విద్యుత్ ఉండదన్నారు.
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీఈఏడీఈ జి. నాగేశ్వరరావు తెలిపారు. పటేల్‌నగర్, బతుకమ్మకుంట, అంబర్‌పేట 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం గంటల 10నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు, ఆప్కో, విఠల్‌వాడి రోడ్, లింగంపల్లి పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్(Abdullapurmet) విద్యుత్ సబ్‌స్టేషన్ మరమ్మతుల నిర్వహణ కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నరేందర్‌నాయక్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అబ్దుల్లాపూర్‌మెట్ టౌన్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ, అబ్దుల్లాపూర్, కవాడిపల్లి, లష్కర్‌గూడ, సుర్మాయిగూడ గ్రామాలతో పాటు పలు ఇండస్ర్టీలకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. బాటసింగారం సబ్‌స్టేషన్ పరిధిలో 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బాటసింగారం, కొత్తగూడెం, పిగ్లీపూర్, జాఫర్‌గూడ, ఇనాంగూడతో పాటు ఇండస్ర్టీలకు సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.
ఉప్పల్: చిలుకానర్ సబ్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్, బోడుప్పల్ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల్లో భాగంగా మంగళవారం పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ విభాగం చిలుకానగర్ ఏఈ వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బోడుప్పల్ దేవేందర్‌నగర్ ఫీడర్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దేవేందర్‌నగర్, గౌతంనగర్, అంబేడ్కర్‌నగర్, రాజీవ్‌నగర్, జ్యోతినగర్ ప్రాంతా ల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనున్నది. చిలుకానగర్ మల్లికార్జుననగర్ ఫీడర్‌లో మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మల్లికార్జుననగర్, నాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాల్లో అదే విధంగా బోడుప్పల్ సూర్యాహిల్స్ ఫీడర్‌లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు రాజశేఖర్‌కాలనీ, పద్మావతి కాలనీ, మెక్‌డోవెల్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిపివేస్తున్నట్లు తెలిపారు.
ఉప్పల్ సబ్‌స్టేషన్ పరిధిలో..
విద్యుత్ లైన్ల నిర్వహన కారణంగా ఉప్పల్ సబ్‌స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్, గాంధీనగర్, స్వరూ్‌పనగర్, కూరగాయల మార్కెట్, స్వరూ్‌పరెడ్డి కాలనీ, సౌత్ స్వరూ్‌పనగర్, ఎస్‌ఎన్ కాలనీ, శ్రీశ్రీనగర్, మల్లికార్జుననగర్, సెవెన్‌హిల్స్ కాలనీ, శ్రీనివాసకాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, కృష్ణారెడ్డి కాలనీ, శేషసాయినగర్‌లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. అదేవిధంగా ఉప్పల్‌ఐడీఏ పరిధిలోని 11కేవీ ఎల్.ఎన్.నగర్ ఫీడర్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామకాలనీ, బాలాజీనగర్, భరత్‌నగర్, టీవీ కాలనీ, చర్చికాలనీ, గాంధీనగర్, జనప్రియ అపార్ట్‌మెంట్స్, రామంతాపూర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
హైదర్‌నగర్: పోలీస్ స్టేషన్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అడ్డగుట్ట రోడ్డు నెంబర్ 1,2,3,4, అర్జున్ థియేటర్ రోడ్ ఫేజ్-2, భాగ్యనగర్ కాలనీలో విద్యుత్ ఉండదన్నారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటలకు జలవాయువిహార్, అడ్డగుట్ట రోడ్డు 5,6, జేఎన్‌టీయూ పోలీస్ స్టేషన్ రోడ్డులో విద్యుత్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News