హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. సొంతింటి కల నెరవేరుస్తాం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:20 PM
పేదల చిరకాల స్వప్నం.. సొంతింంటి కల. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలు వినేందుకు ఎలాంటి అవకాశం ఉండేది కాదని విమర్శించారు.
హైదరాబాద్, జులై 22: నగరంలోని గాంధీభవన్‌లో ప్రతి వారం ప్రజలతో ముఖాముఖి నిర్వహించడం మంచి పరిణామమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలు వినేందుకు ఎలాంటి అవకాశం ఉండేది కాదని విమర్శించారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సొంతింటి కలను తమ ప్రభుత్వం నెరవేర్చుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 7.5 లక్షల ఇళ్లను మంజూరు చేసి ఇచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో సొంత ఇల్లు అనేది చాలామందికి కలగానే ఉండేదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. భూముల ధరలు భారీగా ఉన్న హైదరాబాద్‌లోనూ ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
హైదరాబాద్ ప్రజలు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి: మంత్రి
భాగ్యనగరంలో సొంతింటి కోసం అర్హులైన ప్రజలు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా మరోసారి అప్లై చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యల్లో పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలకు చేరువగా పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూకబ్జాలో సూత్రధారి సీతారాం.. పాత్రధారి ఆయన కుమారుడు: ఎమ్మెల్యే కూన రవికుమార్
ఏపీకి మరో అంతర్జాతీయ పెట్టుబడి.. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
Read Latest AP News And Telugu News