Share News

పీఎం రాహత్ పథకం.. ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వైద్యం: సీఎస్ సంజయ్ జాజు

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:11 PM

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పీఎం రాహత్ పథకంపై దృష్టి సారించింది. ఈ పథకం అమలుపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించి.. ఆసుపత్రుల నమోదును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

పీఎం రాహత్ పథకం.. ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వైద్యం: సీఎస్ సంజయ్ జాజు
PM Rahat Scheme

హైదరాబాద్, అక్టోబర్ 24: రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ పథకం అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఎం రాహత్ పథకం కింద ఒక్కో బాధితుడికి రూ.1.5 లక్షల వరకు వైద్య చికిత్స అందించే అవకాశం ఉందని తెలిపారు.


రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద వెయ్యికి పైగా ఆసుపత్రులు నమోదై ఉండగా.. పీఎం రాహత్‌లో ఇప్పటివరకు 469 ఆసుపత్రులే నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన నెట్‌వర్క్ ఆసుపత్రులను కూడా ఈ పథకంలో నమోదు చేయించాలని సీఎస్ ఆదేశించారు. పీఎం రాహత్ ద్వారా ఏటా కనీసం రూ.100 కోట్ల మేర వైద్య సహాయం అందించే అవకాశం ఉందని, దీని అమలుతో ఆరోగ్యశ్రీపై ఆర్థిక భారం తగ్గే వీలుందని పేర్కొన్నారు. చికిత్స అందించే సమయంలో పోలీసు దర్యాప్తుతో పాటు పథకానికి సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు.. జెడ్పీటీసీ నామినేషన్‌పై అభ్యంతరం

స్థానిక ఎన్నికలను ఆపేందుకు 59 పిటిషన్లు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 05:23 PM