Share News

నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ.. ప్రధానిగా సరికొత్త చరిత్ర: బండి సంజయ్

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:42 PM

ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును లిఖించారని, నెహ్రూ హయాం కంటే ఎక్కువ కాలం దేశాన్ని పాలిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు.

నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ.. ప్రధానిగా సరికొత్త చరిత్ర: బండి సంజయ్
Bandi Sanjay Kumar News

కరీంనగర్, జూన్ 10: భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని, దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందిస్తున్న రికార్డు మోదీ పేరిట లిఖించబడిందని ఆయన కొనియాడారు.


బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘రాబోయే 2047 సంవత్సరం వరకూ నరేంద్ర మోదీయే దేశ ప్రధానిగా కొనసాగాలి. విప్లవాత్మక నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తి ప్రతిష్టలు శరవేగంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారత్‌ను 'విశ్వగురు' స్థానంలో నిలబెట్టడం ఖాయం’ అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ స్పందించారు. ఆ వివాదం పూర్తిగా ఎన్నికల కమిషన్ (ECI) పరిధిలోని అంశమని, చట్టప్రకారం ఈసీనే దానిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.


Also Read:

భారీగా పతనం అయిన బంగారం, వెండి ధరలు..

కాంగ్రెస్‌ డివిజన్‌ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?

Updated Date - Jun 10 , 2026 | 01:09 PM