భారీగా పతనం అయిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Jun 10 , 2026 | 10:26 AM
ఈ రోజు (బుధవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 4,300 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 3,950 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 3,230 రూపాయలు తగ్గింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పేద, మధ్య తరగతి వారికి ఇది పండగలాంటి వార్త అనే చెప్పాలి. బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. ఈ రోజు (బుధవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 4,300 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 3,950 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 3,230 రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,48,860 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,36,450 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,11,640 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. 100 గ్రాముల వెండిపై 1000 రూపాయలు.. కేజీ వెండిపై 10 వేల రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 26,000 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,60,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ డివిజన్ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..