దారుణం.. పెద్దపల్లి జిల్లాలో నిద్రిస్తున్న భర్తను బండరాయితో కొట్టి చంపిన భార్య, కొడుకు
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:05 AM
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన సొంత భార్య, కొడుకు చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..
పెద్దపల్లి, జులై 10: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన సొంత భార్య, కొడుకు చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన సయ్యద్ గోరమియా అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ సమస్యలతో సతమతమవుతూ, వాటి నుంచి ఉపశమనం కోసం మద్యానికి బానిసయ్యాడు. రోజూ మందు తాగి వచ్చి ఇంట్లో గొడవలు చేయడం, కుటుంబ సభ్యులను వేధించడం నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలో అతని భార్య గోరేబి, కొడుకు సయ్యద్ అలీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ వేధింపులకు ఎలాగైనా ముగింపు పలకాలనే ఉద్దేశంతో వారు ఘాతుకానికి ఒడిగట్టారు.
సయ్యద్ గోరమియా మద్యం మత్తులో గాఢనిద్రలో ఉన్న సమయంలో.. భార్య గోరేబి, కొడుకు సయ్యద్ అలీ కలిసి అతడిపై దాడి చేయడానికి పక్కా ప్రణాళిక వేసుకున్నారు. కానీ ప్లాన్ మార్చి.. ఒక పెద్ద బండరాయితో నిద్రిస్తున్న గోరమియా తలపై అత్యంత విచక్షణారహితంగా బాదారు. తీవ్రమైన గాయాలు కావడంతో గోరమియా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులైన భార్య, కొడుకును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్
Read Latest Telangana News And Telugu News