వైద్య రంగంలో ఉస్మానియా అరుదైన ఘనత: మంత్రి దామోదర్ రాజనర్సింహ
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:09 PM
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో 5 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్, జులై 3: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో 5 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశ వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనతను ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి సొంతం చేసుకుంది. అవయవదానం అనేది మహాదానం, ఈ సందేశాన్ని సమాజంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.’ అని అన్నారు.
ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారిగా 5 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు అత్యంత విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 36 గంటల పాటు ఎంతో క్లిష్టంగా సాగిన ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసిన డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్య బృందాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుల ప్రతిభను, వారి అంకితభావాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అవయవదానం అనేది మహాదానమని, ఈ సందేశాన్ని సమాజంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం గట్టి సంకల్పంతో పనిచేస్తోందని మంత్రి దామోదర స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వైద్య రంగ బలోపేతానికి పెద్దపీట వేస్తూ గత రెండున్నరేళ్ల కాలంలోనే 15 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. అంతేకాకుండా, తాజాగా మరో 6,238 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలను నిరంతరం విస్తరిస్తున్నామని, ఉస్మానియా వైద్యుల ఘనతతో తెలంగాణ వైద్య రంగానికి జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
సాయికృష్ణ కేసు.. కోర్టుకు కీలక విషయాలు తెలిపిన సిట్
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ సంస్థలకు గ్రీన్ సిగ్నల్
Read Latest AP News And Telugu News