Onions: మలక్‌పేట మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:31 AM
నగరంలోని మలక్పేట్లోగల వ్యవసాయ మార్కెట్‌కు పెద్దఎత్తున ఉల్లి విక్రయానికి వచ్చింది. సోమవారం ఒక్కరోజే 15 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ మార్కెట్‌కు వచ్చింది. నగరం చుట్టుపక్కల ప్రాంతాలేగాక ఆయా ఏరియాల్లో ఉల్లిపంట సాగుచేశారు.
- ఒక్కరోజే 15వేల క్వింటాళ్లు రాక
హైదరాబాద్: మలక్‌పేట వ్యవసాయ మార్కెట్(Malakpet Agricultural Market)కు ఉల్లి పంట పోటెత్తింది సోమవారం ఒక్కరోజే 15 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ మార్కెట్‌కు వచ్చింది. సాధారణంగా మార్కెట్‌కు ప్రతీ రోజు 5వేల నుంచి 8వేల క్వింటాళ్ళ పంట వస్తుంది. వారం రోజుల నుంచి మార్కెట్‌కు పెద్ద ఎత్తున పంట వస్తోంది. పెద్దరకం ఉల్లి క్వింటా ధర రూ.1900 పలుకుతుండగా..

సాధారణ రకం రూ.1600, చిన్నరకం రూ.1000 పలుకుతోంది. బయటి మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.20 నుంచి 25 అమ్ముతున్నారు. గత ఏడాది సంక్రాంతి పండుగ(Sankranti festival) సీజన్‌తో పోల్చుకుంటే ఈసారి ఉల్లి ధర రూ.20తగ్గింది. పండగ సీజన్‌లో ధర తగ్గడంతో వినియెగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.
వందేభారత్ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ
‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్ సక్సెస్
Read Latest Telangana News and National News