Share News

నిజామాబాద్ జిల్లాకు పంగనామాలు పెట్టిన సీఎం రేవంత్ : బీజేపీ ఎంపీ

ABN , Publish Date - May 18 , 2026 | 01:32 PM

నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్ విలేకర్లతో మాట్లాడారు.

నిజామాబాద్ జిల్లాకు పంగనామాలు పెట్టిన సీఎం రేవంత్ : బీజేపీ ఎంపీ

నిజామాబాద్, మే 18: నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్ విలేకర్లతో మాట్లాడుతూ.. టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే జిల్లాకు మొండిచేయి చూపించారని విమర్శించారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఈ జిల్లాలో టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ తిరుగుతున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్‌కు అవుటర్ రింగ్ రోడ్ ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందూరు ప్రజలను మోసం చేస్తే వారే బుద్ధి చెబుతారన్నారు.


దేవుళ్లను మోసం చేసిన వాడికి ప్రజలను మోసం చేయటం లెక్క కాదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కావని కుండ బద్దలు కొట్టారు. ఇప్పటి వరకు నిజామాబాద్ నగరంలో 25 శాతం డ్రైనేజీ పనులు కూడా పూర్తి కాలేదన్నారు. రూ.162 కోట్లకు గాను కేవలం రూ. 10 కోట్ల నిధులు మాత్రమే యుడిసికి ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. 2039 వరకు రాహుల్ ప్రధాని కారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. అంటే రాహుల్ ఇక ప్రధాని కాలేరని తెలంగాణ సీఎం చెప్పారు. తద్వారా ఇంకో పదేళ్లు దేశంలో బీజేపీ ఉంటుందని తెలంగాణ సీఎం ఒప్పుకున్నారని పేర్కొన్నారు.


రేవంత్ రెడ్డికి బదులు కోమటిరెడ్డి లాంటి జెన్యూన్ పర్సన్‌ని తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. బుల్లెట్ రైల్ కారిడార్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పట్టణాన్ని అప్ గ్రేడ్ చేస్తానని ప్రకటించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్‌నే ప్రజలు నమ్మలేదని.. ఇక లేని ఫ్యూచర్ సిటీ అంటే నమ్ముతారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ చురకలు అంటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

రైలులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2026 | 02:05 PM