Share News

మెరిసిన ‘పచ్చ’ బంగారం

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:32 AM

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడ్డ కరువు వల్ల సాగుతోపాటు తగ్గిన దిగుబడి.. విదేశాల్లో పెరిగిన డిమాండ్‌.. తగ్గిన నిల్వలతో వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధరలు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి.

మెరిసిన ‘పచ్చ’ బంగారం
Nizamabad Turmeric Price

  • పసుపునకు ఆల్‌టైం రికార్డు గరిష్ఠ ధర

  • నిజామాబాద్‌లో రూ.28,111

  • 6 నెలల్లో రూ.16 వేలు పెరుగుదల

  • నిల్వ చేసుకున్న రైతులకు కాసుల వర్షం

నిజామాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడ్డ కరువు వల్ల సాగుతోపాటు తగ్గిన దిగుబడి.. విదేశాల్లో పెరిగిన డిమాండ్‌.. తగ్గిన నిల్వలతో వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధరలు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. వేసవిలోనే పంట చేతికొచ్చినా నిల్వ చేసుకున్న రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గత ఏప్రిల్‌ 30న నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.12 వేలు పలికిన పసుపు ధర గత రెండు, మూడు రోజులుగా ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకెళ్లింది.


దీపావళి పండుగ సెలవుల తర్వాత బుధవారం తెరుచుకున్న నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌ పసుపు ధర రూ.24,400 నుంచి రూ.28,111 వరకూ వెళ్లింది. కుర్కుమిన్‌ శాతం అధికంగా ఉండే రకాలతోపాటు సేంద్రీయ పసుపుకు డిమాండ్‌ పెరుగుతోంది. అంటే, నాడు పంట నిల్వ చేసుకున్న రైతులకు ‘పసుపు’ కాసుల వర్షం కురిపిస్తోంది. స్థానికంగా నిల్వ చేయడానికి గిడ్డంగుల్లేకపోవడం కూడా పసుపు ధర పైపైకి దూసుకెళ్లడానికి మరో కారణం. తక్కువ వడ్డీతో గిడ్డంగుల నిర్మాణానికి రుణాల మంజూరు, మార్కెట్‌ ధరల సమాచారం, ప్రభుత్వ జోక్యంతో పసుపు ధరలు పెరిగి అన్నదాతలకు మేలు జరుగుతోందని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం

Updated Date - Nov 15 , 2026 | 05:32 AM