Share News

కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. 12 షాపుల దగ్ధం.. భారీగా ఆస్తినష్టం

ABN , Publish Date - May 03 , 2026 | 10:27 AM

తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే పాత బస్టాండ్‌ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 12 షాపులు పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి.

కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. 12 షాపుల దగ్ధం.. భారీగా ఆస్తినష్టం
Kamareddy Fire Accident

కామారెడ్డి, మే 3: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి పట్టణం పాత బస్టాండ్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 షాపులు దగ్ధమయ్యాయి. పాత బస్టాండ్ మూలమలుపు వద్ద ఉన్న సుమారు 12 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి . 12 షాపులకు సంబంధించి రూ. 50 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రమాదవశత్తు అగ్ని ప్రమాదం జరిగిందా? లేక ఎవరైనా కావాలనే నిప్పంటించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. దుకాణాలు దగ్ధం కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

Updated Date - May 03 , 2026 | 11:08 AM