Share News

రెండు బస్సులు ఢీకొని ముగ్గురికి స్వల్పగాయాలు..

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:46 AM

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.

రెండు బస్సులు ఢీకొని ముగ్గురికి స్వల్పగాయాలు..
Suryapet Road Accident

సూర్యాపేట: మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.


ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్టీసీ బస్సు ముందు భాగంలో డ్రైవర్‌ ఇరుక్కుపోవడంతో అతడిని బయటకు తీసేందుకు అగ్నిమాపక, పోలీసు, ఎన్‌హెచ్‌-65 సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు రెండు గంటలపాటు సహాయక చర్యలు చేపట్టి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

మీ ఓటు మీ చేతిలోనే!

భారీగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌

Updated Date - Aug 16 , 2026 | 06:46 AM