సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి సజీవ దహనం..
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:00 PM
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పడంతో న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీశ్ దహనమయ్యారు.
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఇవాళ (శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పడంతో ఒకరు మృతిచెందారు. ఖమ్మంలోని మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీశ్ కారులో ప్రయాణిస్తున్నారు. అయితే, పిల్లలమర్రి సమీపానికి రాగానే ఆయన కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో డాక్టర్ జగదీశ్ సజీవ దహనమయ్యారు. కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి వివరాలను సేకరించారు. మృతుడిని డాక్టర్ జగదీశ్‌గా గుర్తించి సమాచారాన్ని బాధిత కుటుంబానికి తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఎస్బీఐ ఏటీఎంల చోరీ..
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. మూడేళ్ల బాలుడి మృతి