డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదు: కల్వకుంట్ల కవిత..
ABN , Publish Date - Nov 07 , 2026 | 03:09 PM
ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం అసాధ్యమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. గోదావరి నీళ్లను తీసుకువస్తేనే నల్లగొండ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అభిప్రాయపడ్డారు.
నల్లగొండ: ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం అసాధ్యమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. గోదావరి నీళ్లను తీసుకువస్తేనే నల్లగొండ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అభిప్రాయపడ్డారు. నార్లాపూర్ రిజర్వాయర్ పనులు చేపడితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డ్యామేజ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇక, మహబూబ్ నగర్‌కు నీళ్లు ఇవ్వడానికే చాలా సమయం పడుతుందని, నల్లగొండకు నీళ్లు రావడం సాధ్యం కాదని తెలిపారు. ఈరోజు (శనివారం) డిండి రిజర్వాయర్‌ను కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత మాట్లాడుతూ.. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఉల్పర, శివన్నగూడెంకు నేరుగా గోదావరి నీళ్లు ఇవ్వవచ్చని చెప్పారు. తాము తీసుకొచ్చిన ప్రతిపాదన ఎలాంటిదో, ఎంత ఉపయోగకరమైనదో ఈ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు. అవసరమైతే ఇంజినీర్లతో తనిఖీ చేయించుకోవాలని సూచించారు. ఎస్ఎల్‌బీసీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల సొరంగంలో కార్మికులు మృతిచెందారని ఆరోపించారు. గత ప్రభుత్వం టన్నెల్‌ను కొంత నిర్లక్ష్యం చేసిందని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు కవిత చెప్పుకొచ్చారు.
గోదావరి, కావేరి నదుల అనుసంధానం తుపాకులగూడెం వద్దే జరగాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేసుగుర్రం అనుకుంటే కీలు గుర్రం అయ్యిందని, సీఎం రేవంత్ చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని, బీఆర్ఎస్ నిద్రమత్తును వదిలించాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని కవిత కోరారు. మరోవైపు, పంటలు వేయొద్దంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమి ఇస్తుందో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్
జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం