Share News

నేటికి వ్యవసాయ శాఖపై సమీక్ష చేయని సీఎం రేవంత్: కవిత

ABN , Publish Date - Jun 11 , 2026 | 06:21 PM

తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1200 కోట్లు కప్పం కట్టించుకున్న సిగ్గు లేని ప్రభుత్వం ఇదంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేటికి వ్యవసాయ శాఖపై సమీక్ష చేయని సీఎం రేవంత్: కవిత
Kavitha

నల్గొండ, జూన్11: తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1200 కోట్లు కప్పం కట్టించుకున్న సిగ్గు లేని ప్రభుత్వం ఇదంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నల్గొండలో రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు.


అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. మట్టి తల్లిని అలుసుగా చూస్తూ వ్యవసాయాన్ని కర్మకు వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేయవచ్చని స్పష్టం చేశారు.


వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న సౌకర్యాలు రైతులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ సందర్బంగా కవిత సూచించారు. రైతును రాజు చేసేందుకు తెలంగాణ రక్షణ సేన ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని వివరించారు.


ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 10 తీర్మానాలు ఆమోదించినట్లు కవిత తెలిపారు. అవి..

1. రైతు డిస్కం వద్దు.

2. యూరియా యాప్ తీసేయాలి.

3. బకాయి పడ్డ రైతు భరోసా తక్షణమే అందించాలి.

4. కౌలు రైతులను గుర్తించి వారికి రైతు భరోసా ఇవ్వాలి.

5. రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలి.


6. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

7. మూసీ నదిలో కాలుష్యాన్ని నివారించాలి.

8. నిమ్మ, బత్తాయి రైతులకు అండగా నిలవాలి.

9. పత్తి రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలి.

10. రైతు సమస్యలపై ఉమ్మడి కార్యాచరణతో భవిష్యత్ ఉద్యమాలు చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉపాధ్యాయ నియామకాల్లో గొడ్డలి రాజకీయాలు చేస్తున్న జగన్ : టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్

పనిచేయని సీఎంకు ఇన్ని క్యాంపు కార్యాలయాలు ఎందుకు?: హరీశ్ రావు

For More TG News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 06:26 PM