Share News

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు..

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:44 PM

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం అంబటోనిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు..
Nalgonda Road Accident

నల్లగొండ: దేవరకొండ మండలం అంబటోనిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితులను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీరును పరిశీలించి మృతిచెందిన వారి వివరాలను ఆరా తీశారు.


ఈ మేరకు మృతులను నేరడుగొమ్ము మండలం పెద్దమునగల్ గ్రామానికి చెందిన అంజయ్య, చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కోటేశ్‌గా గుర్తించారు. అనంతరం బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

సైబర్ బ్యూరో భారీ ఆపరేషన్.. వంద మందికి పైగా ఏజెంట్ల అరెస్ట్

Updated Date - Oct 06 , 2026 | 08:44 PM