Share News

తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం.. ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - May 03 , 2026 | 08:21 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల బీభత్సం వల్ల పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం.. ఈదురుగాలుల బీభత్సం
Telangana Weather Update

నల్లగొండ, మే 03: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, ఈదురుగాలుల బీభత్సం వల్ల పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లాలో చాలా చోట్ల ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. హలియా నుంచి నల్గొండ వెళ్ళే ప్రధాన రహదారిపై పలు చోట్ల విరిగిపడ్డ చెట్లు విరిగిపడ్డాయి. తిప్పర్తి మండలంలో అద్దంకి -నార్కట్ పల్లి ప్రధాన హైవేపై చెట్లు విరిగిపడటంతో అరగంట పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


నకిరేకల్, కట్టంగూర్, కేతెపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి వరంగల్, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వడగళ్ల వాన పడింది. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - May 03 , 2026 | 08:25 PM