Share News

ప్రేమ వివాహం.. మేడ్చల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:21 PM

మేడ్చల్‌ జిల్లా పోచారంలోని గెలాక్సీ టవర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇంట్లో ఉరివేసుకుని ఉన్న ఆమెను పనిమనిషి గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. అయితే మౌనిక మృతిపై భర్త వేధింపులే కారణమంటూ బంధువులు ఆరోపించడం ఈ ఘటనపై అనుమానాలను మరింత పెంచింది..

ప్రేమ వివాహం.. మేడ్చల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
Medchal News

మేడ్చల్, సెప్టెంబర్ 20: జిల్లాలోని పోచారం గెలాక్సీ టవర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మౌనిక సంతోషి (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంట్లో ఆమె ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించిన పనిమనిషి పోలీసులకు సమాచారం అందించింది. మౌనిక యాక్సిస్ బ్యాంక్‌ ఐటీ విభాగంలో పనిచేస్తుండగా.. ఆమె భర్త రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. మౌనిక, రమాకాంత్‌ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారని.. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కవల మగపిల్లలు ఉన్నారని బంధువులు తెలిపారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని పనిమనిషి గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.


మౌనిక మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే మృతికి అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తూ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత మౌనిక మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్

రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం

Read Latest Telangana News And AP News

Updated Date - Sep 20 , 2026 | 07:03 PM