Share News

మెదక్‌లో చిరుత కలకలం.. రోడ్డు దాటుతుండగా వీడియో తీసిన యువకుడు

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:18 AM

మెదక్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ శివారులో చిరుతపులి కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

మెదక్‌లో చిరుత కలకలం.. రోడ్డు దాటుతుండగా వీడియో తీసిన యువకుడు
Medak Leopard Sighting

మెదక్, నవంబర్ 9: జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ శివారులో చిరుతపులి కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాకుల గుట్ట సమీపంలోని కామారెడ్డి-రామాయంపేట రహదారిపై చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. చిరుతపులి రహదారి దాటుతున్న దృశ్యాలను ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు.


రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్న సమయంలో చిరుత కనిపించడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో టపాసుల వివాదం.. కత్తులతో దాడి, ముగ్గురికి గాయాలు

‘పనులను అడ్డుకుంటే ఊరుకోం’.. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యపై బండి సంజయ్ వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 01:05 PM