Share News

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: హరీశ్ రావు

ABN , Publish Date - Oct 18 , 2026 | 09:08 PM

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలంగాణ బిడ్డలు చాటి చెబుతున్నారని అన్నారు.

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: హరీశ్ రావు

సిద్దిపేట, అక్టోబర్18: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలంగాణ బిడ్డలు చాటి చెబుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మకు అధికారిక గుర్తింపు అని తెలిపారు. ఆదివారం సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కుటుంబ సమేతంగా ఆయన పాల్గొన్నారు.


ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. భారతదేశంలో తెలంగాణకు ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ అని గుర్తు చేశారు. పర్యావరణాన్ని పూజించే సంస్కృతి మనదని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.


రాష్ట్రంలో నీటి గోస.. సిద్దిపేటలో మాత్రం కోమటి చెరువు మత్తడి దూకుడుతో ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సిద్దిపేటకు గోదావరి జలాలు వస్తాయని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నీళ్లతోనే కోమటి చెరువుకు జలకళ వచ్చిందని తెలిపారు.

ఒకప్పుడు ఈ కోమటి చెరువు.. మురికికూపంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నా.. నేడు గోదావరి జలాలతో అలుగు పారుతోందని చెప్పారు. సద్దుల బతుకమ్మ సంబరాలు చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదని హరీశ్ రావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

Updated Date - Oct 18 , 2026 | 09:16 PM