గజ్వేల్ ఏసీపీ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:24 PM
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ఏసీపీ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఓ వివాదానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ సదరు మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 26: జిల్లాలోని గజ్వేల్ ఏసీపీ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఓ వివాదానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ సదరు మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామానికి చెందిన బేగం బి (35) అనే మహిళ గజ్వేల్ ఏసీపీ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొన్ని రోజులుగా గ్రామంలో పక్కింటి వాళ్లతో డబ్బుల విషయమై మహిళకు గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇదే విషయమై రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు మహిళ వెళ్లింది. అయితే తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించింది. దీంతో గజ్వేల్ ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అక్కడ కూడా స్పందన లేకపోవడంతో మహిళ పురుగు మందు తాగినట్లు సమాచారం. వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ జరపాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
కామారెడ్డి కలెక్టర్ పేరుతో ఫేక్ ఐడీలు.. సైబర్ క్రైమ్ కేసు నమోదు
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముగ్గురు విదేశీ మహిళల అరెస్ట్
Read Latest AP News And Telugu News