Share News

మేడ్చల్ జిల్లాలో దారుణం.. ఇంజక్షన్‌తో వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:58 PM

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జోసెఫ్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ఇంజక్షన్‌తో జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

మేడ్చల్ జిల్లాలో దారుణం.. ఇంజక్షన్‌తో వ్యక్తి ఆత్మహత్య
Hyderabad suicide case

హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఇటీవల వరుస ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి వివిధ కారణాలతో కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్షణికావేశంలో నిండునూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. రెండు రోజుల క్రితమే కూకట్‌పల్లిలో ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరువకముందే.. తాజాగా మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.


జోసెఫ్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఔటర్‌రింగ్ రోడ్డుపై కారులో ఇంజక్షన్‌తో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వీణాపాణికి వాట్సాప్‌లో లైవ్ లొకేషన్ షేర్ చేసి బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే వీణాపాణి లొకేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే జోసెఫ్ కారులో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. కారును, మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. జోసెఫ్ మృతికి కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి: ఎంపీ పురందేశ్వరి

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Updated Date - Apr 01 , 2026 | 06:23 PM