Share News

వికారాబాద్‌లో రూ.27 లక్షల విలువైన గంజాయి పట్టివేత..

ABN , Publish Date - Aug 12 , 2026 | 03:10 PM

వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఎక్సైజ్‌ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వికారాబాద్‌లో రూ.27 లక్షల విలువైన గంజాయి పట్టివేత..
Tandur Ganja Seizure

వికారాబాద్: తాండూరులో రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


పక్కా సమాచారంతో దాడులు

ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తాండూరులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రైలులో గంజాయిని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి తాండూరులో రైలు దిగి, అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఒప్పందం

గంజాయిని తరలించేందుకు నిందితులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఒప్పందం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. బ్రీఫ్‌కేసుల్లో గంజాయి ప్యాకెట్లను పెట్టుకుని తరలిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మధు ప్రధాన్ (34), సింబా సాహక్ (22), నీల్ మండల్ (22)లను అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో ఎక్సైజ్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.


Also Read:

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం..

Updated Date - Aug 12 , 2026 | 03:11 PM