Share News

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

ABN , Publish Date - Jun 08 , 2026 | 09:10 PM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2027 నాటికి ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకు భూసేకరణ, పునరావాస పనులు మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2027 నాటికి ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకు భూసేకరణ, పునరావాస పనులు మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించి పాలమూరు ప్రాజెక్టులపై ఫాస్ట్‌ట్రాక్ ఆదేశాలు జారీ చేశారు.


ఈ సందర్భంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జూన్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ఉత్తమ్ అధికారులకు చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కీలక దశ డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని ఆజ్ఞాపించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్ హౌస్‌లకు తక్షణమే విద్యుత్ కనెక్టివిటీ కల్పించాలన్నారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు కోసం 2,200 ఎకరాల భూసేకరణ ప్రారంభమైందని ఉత్తమ్ తెలిపారు. రాజీవ్ భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల భూసేకరణకు గడువు ఖరారు చేయాలని మంత్రి ఆదేశించారు.


నెట్టెంపాడు ప్రాజెక్టుతో అదనంగా 58 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సౌర విద్యుత్ వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. పనితీరు సరిగా లేని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాలమూరు రైతుల దశ మార్చే ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

పర్యాటక రంగం ద్వారా ఉపాధి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: మంత్రి జూపల్లి

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

Updated Date - Jun 08 , 2026 | 09:14 PM