నల్లమలలో జంగల్ సఫారీ పునఃప్రారంభం
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:09 AM
దేశంలోనే రెండో అతి పెద్దదైన అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)లో గురువారం జంగల్ సఫారీ పునఃప్రారంభమైంది.
మన్ననూర్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే రెండో అతి పెద్దదైన అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)లో గురువారం జంగల్ సఫారీ పునఃప్రారంభమైంది. నాగర్‌కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలోని పర్హాబాద్ వద్ద జంగల్ సఫారీ టూర్ వాహనాలను ఎఫ్‌డీఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీఓ యష్ చంద్రప్రకాశ్ సింఘాల్ పర్యాటకులకు నల్లమల ప్రాంత ప్రత్యేకత, వన్యప్రాణుల సంచారం, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
అటవీ శాఖ నిబంధనలు పాటిస్తూనే టైగర్ సఫారీ పర్యటనకు రావొచ్చని, అడవుల్లో వన్యప్రాణులకు హాని కలిగించే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించామని చంద్రప్రకాశ్ సింఘాల్ తెలిపారు. ప్రతి ఏటా 3 నెలలు వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయంలో టైగర్ సఫారీ నిలిపి వేస్తామని, తిరిగి పర్యాటకులకు టైగర్ సఫారీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. జూన్ వరకు 9 మాసాల పాటు పర్యాటకులు వన్యప్రాణులను, అడవులను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఎన్నికల కమిషన్, హైదరాబాద్ తగలబడిపోతయ్
ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించునో!?
Read Latest Telangana News And Telugu News