Share News

Narayanapet: ఇద్దరు చిన్నారులను చంపిన తండ్రి.. ఆపై

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:13 PM

నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. కన్న బిడ్డలను తండ్రే పొట్టనబెట్టుకున్నాడు. ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపేసి చెరువులో పడేశాడు.

Narayanapet: ఇద్దరు చిన్నారులను చంపిన తండ్రి.. ఆపై
Narayanapet

నారాయణపేట జిల్లా, జనవరి 6: బిడ్డల భవిష్యత్‌ కోసం కన్న తండ్రి ఎంతో కష్టపడుతుంటారు. వారికి మంచి జీవితం ఇచ్చేందుకు శ్రమిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే తండ్రి మాత్రం బిడ్డల పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రే కాలయముడిగా మారాడు. కడుపున పుట్టిన పిల్లలను చేతులారా చంపేశాడో కసాయి తండ్రి. ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. నారాయణపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..


జిల్లాలోని మరికల్ మండలం తీలేరులో దారుణం జరిగింది. కన్న బిడ్డలను తండ్రి అతి కిరాతకంగా చంపేశాడు. గ్రామానికి చెందిన శివరాములు.. తన ఇద్దరు చిన్నారులను ఉరివేసి చంపి అనంతరం వారిని చెరువులో పడేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యయాత్నానికి పాల్పడ్డాడు. ముందుగా కరెంట్ తీగను పట్టుకుని చనిపోయేందుకు ప్రయత్నించాడు. ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. శివరాములును గమనించిన స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


ప్రస్తుతం శివరాములు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో చెరువులో నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు పిల్లలను శివరాములు ఎందుకు చంపాడు?.. చిన్నారుల హత్యకు.. శివరాములు ఆత్మహత్యకు గల కారణాలేంటి? కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


ఇవి కూడా చదవండి...

జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం..

విషాదం.. నీటితొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 06 , 2026 | 04:07 PM