నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Jun 07 , 2026 | 08:47 AM
నిర్మల్ జిల్లాలోని తానూరు మండల పరిధిలో చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
నిర్మల్ జిల్లా, జూన్ 07: జిల్లాలోని తానూరు మండల పరిధిలో చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మండలంలోని మొగిలి గ్రామ శివారులో ఓ చిరుతపులి.. పశువుల మందపై దాడికి తెగబడింది. ఈ దాడిలో ఓ ఆవు దూడ మృతి చెందింది. గ్రామ శివారులోని పొలాల సమీపంలో పశువులు మేత మేస్తుండగా చిరత అటాక్ చేసింది. ఆవు దూడ మృతి చెందడతంతో రైతులు, పశువుల కాపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా వన్యప్రాణుల సంచారం పెరిగిందని, ఇప్పుడు నేరుగా గ్రామ శివారుల్లోనే చిరుత దాడికి పాల్పడటంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. చీకటి పడితే ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్థులు ఒంటరిగా పొలాలకు వెళ్దొద్దని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చిరుతను వీలైనంత త్వరగా బంధించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని
దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
Read Latest AP News And Telugu News