తులం బంగారం వచ్చిన వారు కాంగ్రెస్‌కు ఓటెయ్యండి: కేటీఆర్
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:48 PM
సిరిసిల్ల పట్టణం బివైనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే సిరిసిల్లా జిల్లాను తీసేస్తారని ఆయన విమర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 05: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇవాళ(గురువారం) సిరిసిల్ల పట్టణం బివైనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే సిరిసిల్లా జిల్లాను తీసేస్తారని ఆయన విమర్శించారు. 'ఓవైపు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, మరోవైపు ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్, ఎప్పుడో ఒకసారి దేవుని పేరు చెప్పుకుని వచ్చే బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఎవరికి ఓటు వేయ్యాలో మీరే నిర్ణయించుకోవాలి' అని కేటీఆర్ అన్నారు.
'కాంగ్రెస్ వాళ్లు తులం బంగారం ఇస్తానన్నారు. కానీ, వాళ్లు ఉన్న పుస్తెలు ఎత్తుకు పోయే రకం. నాపై కోపంతో బతుకమ్మ చీరలు బంద్ చేశారు. నేతన్నల బతుకుదెరువుపై దెబ్బ కొట్టారు. దేవుని గుడి వద్ద ఉండి అడుక్కుతినేవారిలాగా, దేవుని పేరుతో ఓట్టడుక్కోవడానికి మాత్రమే బీజేపీ(BJP) వారే వస్తారు. అలానే కాంగ్రెస్ కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారు. తులం బంగారం వచ్చిన వారు కాంగ్రెస్ కు ఓటెయ్యండి, రానివారు బీఆర్ఎస్(BRS)కు ఓటెయ్యండి. సిరిసిల్ల బతుకుదెరువు లేకుండా చేసినోడికి, గట్టి బుద్ది చెప్పాలి' అని కేటీఆర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు
వీధి దీపాలు వెలిగించేందుకు ఈ ప్రభుత్వం వద్ద డబ్బులేవు: కేంద్ర మంత్రి