Share News

రైతులకు కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 08:36 PM

పాలమూరు రైతుల సాగునీరు, విద్యుత్ సమస్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. వనపర్తి జిల్లా పెబ్బేరులో రైతులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

రైతులకు కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
KTR Latest News

వనపర్తి, సెప్టెంబర్ 19: జిల్లాలోని పెబ్బేరు పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో రైతులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం, లోఓల్టేజ్‌, తరచూ విద్యుత్‌ కోతలతో మోటార్లు కాలిపోతున్నాయని తన దృష్టికి తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. ఆరు గంటలకు మించి విద్యుత్‌ సరఫరా కావడం లేదని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు రెండు సబ్‌స్టేషన్లకు రైతులతో కలిసి వెళ్లామని.. అక్కడ అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. ప్రకృతి సమృద్ధిగా నీళ్లు ఇచ్చినా రైతులకు సాగునీరు అందడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో పాలమూరులో పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని కేటీఆర్ పేర్కొన్నారు. చెక్‌డ్యామ్‌లు, చెరువులు నింపడంతో పాటు వరదలు వచ్చినప్పుడు నీటిని మళ్లించి రైతులకు అందించేవారమని చెప్పారు.


కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, వెలుగొండ ద్వారా ఏపీకి నీళ్లు వెళ్తున్నాయని, జూరాలకు ఎగువ నుంచి నీరు లేదని అధికారులు చెబుతున్నారని అన్నారు. ఏపీకి నీళ్లు వెళ్తున్నప్పుడు తెలంగాణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కల్వకుర్తి పంపులను రోజుకు రెండు.. మూడు సార్లు ఆన్‌–ఆఫ్‌ చేయడం కాకుండా ఒకసారి ఆన్‌ చేస్తే నిరంతరంగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక, ఏపీ తమ నీటి ప్రయోజనాల కోసం ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయని, తెలంగాణ మాత్రం కృష్ణా జలాల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో వ్యవహరించడం లేదని విమర్శించారు. ఆలమట్టి ఎత్తు పెంచే యోచనలో కర్ణాటక ఉందని, అదే జరిగితే భవిష్యత్తులో పాలమూరుకు నీటి లభ్యతపై ప్రభావం పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో పాలమూరు వాటా దక్కే వరకు పోరాడుతామని, అధికారంలో ఉన్నవారు జరిగిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

జగన్‌ యూరప్‌ పర్యటనకు షరతులు

రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 09:25 PM