ఏపీలో జగన్‌కు లేని హోదా.. ఇక్కడ కేసీఆర్‌కు ఇచ్చాం: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Mar 15 , 2026 | 08:53 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
సంగారెడ్డి, మార్చి15: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కేవలం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని, ఈసారైనా పూర్తిస్థాయిలో సభలో ఉండాలని ఆయన కోరారు.
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజల తరఫున నేను కేసీఆర్‌కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సభకు వచ్చి మా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. మీరు ఇచ్చే మంచి సూచనలు స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వైపీసీ 11 సీట్లు వచ్చినా అక్కడ ప్రతిపక్ష హోదా దక్కలేదు, కానీ తెలంగాణలో మేము గౌరవప్రదంగా ప్రతిపక్ష హోదా ఇచ్చాం. ప్రభుత్వం చేసే మంచి పనులను కేసీఆర్ అభినందిస్తే, ఆయనకే గౌరవం. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము అధికార పార్టీలో ఉండి కూడా రాష్ట్రం కోసం సస్పెండ్ అయ్యాను. మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తుంటే నవ్వు వస్తోంది. మూసీ కాలుష్యం వల్ల నల్గొండ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాకు తెలుసు. ఫ్లోరైడ్ సమస్యలతో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..
డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా