కోదాడలో కొలువుల జాతరకు రంగం సిద్ధం.. యువతకు భారీ అవకాశాలు
ABN , Publish Date - Sep 13 , 2026 | 08:03 PM
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కోదాడలో జరగనున్న మెగా జాబ్ మేళా భారీ అవకాశాలను అందించనుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 300 కంపెనీలు, దాదాపు 25 వేల ఉద్యోగ అవకాశాలతో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
కోదాడ, సెప్టెంబర్ 13: సమాజంలో ప్రస్తుతం అతి పెద్ద సమస్య నిరుద్యోగమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో ఈ నెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ జాబ్ మేళాకు సుమారు 300 కంపెనీలు వచ్చే అవకాశం ఉందని.. దాదాపు 25 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గ్రామాల వారీగా విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రతి ఒక్కరికీ సమాచారం చేరేలా చూడాలని అధికారులను.. పార్టీ నాయకులను ఆదేశించారు. ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న నిరుద్యోగులు kodadameghajobmela.com వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని.. అయితే ప్రతిపక్షాలు నోరు జారకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టుల్లో తగినంత నీరు లేకపోవడంతో కొన్ని ప్రాంతాలకు నీటిని అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. కోదాడలో జరగనున్న మెగా జాబ్ మేళాకు మంత్రి శ్రీధర్ బాబు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జాబ్ మేళాను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ
విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..
For More AP News And Telugu News