Share News

Hyderabad: పతంగుల ఎఫెక్ట్.. 309 ఫీడర్లు ట్రిప్‌

ABN , Publish Date - Jan 17 , 2026 | 09:10 AM

సంక్రాంతి పండుగ సంబరాల్లో ఎగురవేసే పతంగుల వల్ల హైదరాబాద్ నగర వ్యాప్తంగా 309 ఫీడర్లు ట్రిప్‌ అయ్యాయి. పతంగులు, మాంజా వల్ల విద్యుత్ తీగెలకు చుట్టుకొని ట్రిప్ అయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అతరాయం ఏర్పడింది.

Hyderabad: పతంగుల ఎఫెక్ట్.. 309 ఫీడర్లు ట్రిప్‌

- గాలి పటాలు, మాంజాతో విద్యుత్‌ అంతరాయాలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో ఎగురవేస్తున్న పతంగులు, మాంజాతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. రెండు రోజులుగా విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలపై పతంగులు, మాంజా పడి పెద్దసంఖ్యలో విద్యుత్‌ ఫీడర్లు ట్రిప్‌ అయ్యాయి. బుధవారం 309 ఫీడర్లు ట్రిప్పవ్వగా. గురువారం అదే స్థాయిలో ఫీడర్లు ట్రిప్పయి పలు ప్రాంతాల్లో 5-10 నిమిషాల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. సిబ్బంది విద్యుత్‌ తీగలపై పడిన పతంగులను తొలగించి సరఫరాను పునరుద్ధరించారు.


city5.2.jpg

అత్యధికంగా హైదరాబాద్‌ సౌత్‌సర్కిల్‌(Hyderabad South Circle) పరిధిలో 107 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. పతంగులు విద్యుత్‌ తీగలకు తగిలి 15కు పైగా ప్రాంతాల్లో బ్రేక్‌డౌన్‌ సమస్యలు తలెత్తాయి. పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలో కూడా విద్యుత్‌ సిబ్బంది పతంగులను తొలగించారు. హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో 45, సికింద్రాబాద్‌ సర్కిల్‌లో 45,


city5.jpgబంజారాహిల్స్‌(Banjara Hills)లో 8, రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 26, సరూర్‌నగర్‌లో 26, సైబర్‌సిటీలో 20, హబ్సిగూడలో 17, మేడ్చల్‌ సర్కిల్‌లో 18, బంజారాహిల్స్‌ సర్కిల్‌లో 8కి పైగా ఫీడర్లు ట్రిప్పయ్యాయి. విద్యుత్‌తీగలపై పడిన పతంగులు, మాంజా తొలగించేందుకు సోమవారం వరకు ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నామని సర్కిల్‌, డివిజన్ల ఉన్నతాధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది

వేడి వేడిగా వెరైటీ సూప్‌లు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 17 , 2026 | 09:10 AM