Share News

ఖరీఫ్ కు యూరియా గండం

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:40 AM

గల్ఫ్‌లో యుద్ధం కారణంగా రాష్ట్రంలో రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఎల్‌ఎన్‌జీ (గ్యాస్‌) సరఫరాలో ఇబ్బందులతో దేశంలో...

ఖరీఫ్ కు యూరియా గండం

ఉత్పత్తిపై గల్ఫ్‌ యుద్ధం ప్రభావం

  • యూరియా తయారీలో వాడే గ్యాస్‌కు కొరత

  • రాష్ట్రంలో ప్రస్తుతం 50వేల టన్నుల యూరియా

  • ఖరీఫ్‌ ఆరంభానికి 5లక్షల టన్నులు అవసరం

పెద్దపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌లో యుద్ధం కారణంగా రాష్ట్రంలో రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఎల్‌ఎన్‌జీ (గ్యాస్‌) సరఫరాలో ఇబ్బందులతో దేశంలో యూరియా ఉత్పత్తి తగ్గిపోతోంది. రామగుండం ఫర్టిలైజర్స్‌ కంపెనీ(ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)లో ప్రస్తుతం కేవలం 50 వేల టన్నుల యూరియా మాత్రమే నిల్వ ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమయ్యే నాటికి రాష్ట్రంలో కనీసం 5లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. తెలంగాణలో ఖరీ్‌ఫలో 1.33కోట్ల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు వేస్తారు. అన్ని పంటలకు కలిపి ఖరీఫ్‌ సీజన్‌ మొత్తానికి 10-11 లక్షల టన్నుల యూరియా అవసరం. ఖరీఫ్‌ ప్రారంభంలో 5లక్షల యూరియా బఫర్‌ ఉంటేనే రైతులకు సరఫరా చేయడానికి ఇబ్బంది ఉండదు.

ఆర్‌ఎఫ్ సీఎల్‌ కు ఖతార్‌ నుంచి గ్యాస్‌

2021 మార్చి 25 నుంచి ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో యూరియా ఉత్పత్తి అవుతోంది. దీని సామర్థ్యం రోజుకు 3,850 టన్నులు. ఏడాదికి 12 లక్షల టన్నులు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో రాష్ట్ర అవసరాలకు 45ు కేటాయించగా మిగతా యూరియా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ గ్యాస్‌ ఆధారిత ఫ్యాక్టరీ. ఖతార్‌ నుంచి దీనికి గ్యాస్‌ సరఫరా అవుతుంది. గ్యాస్‌ మొదట ఖతార్‌ నుంచి గుజరాత్‌కు నౌకల్లో చేరుకుంటుంది. అక్కడి నుంచి పైప్‌లైన్‌ ద్వారా కాకినాడకు, తర్వాత మల్లవరం ఆ తర్వాత ఆర్‌ఎ్‌ఫసీఎల్‌కు సరఫరా చేస్తారు. ఈ ఫ్యాక్టరీకి రోజుకు 20లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎల్‌ఎన్‌జీ గ్యాస్‌ అవసరం కానీ, ప్రస్తుతం యుద్ధం కారణంగా 17లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో, యూరియా ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న లెక్కన చూస్తే జూన్‌ నెలాఖరు వరకు యూరియా బఫర్‌ స్టాక్‌ 2 నుంచి 2.5 లక్షల టన్నులు మాత్రమే ఉండే అవకాశాలున్నాయి. దక్షిణ భారతదేశంలో రామగుండంలో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ కంపెనీ ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఎన్‌ఎ్‌ఫఎల్‌, ఇఫ్కో, క్రిభ్‌కో, ఆర్‌సీఎఫ్‌, జీఎ్‌సఎ్‌ఫసీ, చంబల్‌ ఫర్టిలైజర్స్‌ తదితర కంపెనీలున్నాయి. ఇందులో చాలా వరకు గ్యాస్‌ ఆధారిత కంపెనీలే. గ్యాస్‌ కొరత కారణంగా వీటిల్లో కూడా యూరియా ఉత్పత్తి తగ్గుముఖం పడుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 06:40 AM