Share News

ఉద్యోగి ఆత్మహత్య ఘటనలో ఆరుగురిపై కేసు

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:43 AM

భద్రాచలంలో శనివారం ఆత్మహత్య చేసుకున్న పాల్వంచ పౌరసరఫరాల శాఖ పరిధిలోని గ్యాస్‌ గోడౌన్‌ మేనేజర్‌ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య కేసులో...

ఉద్యోగి ఆత్మహత్య ఘటనలో ఆరుగురిపై కేసు
Bhadrachalam Suicide Case

  • వీరిలో నలుగురు విలేకరులు

భద్రాచలం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : భద్రాచలంలో శనివారం ఆత్మహత్య చేసుకున్న పాల్వంచ పౌరసరఫరాల శాఖ పరిధిలోని గ్యాస్‌ గోడౌన్‌ మేనేజర్‌ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య కేసులో... ఆరుగురిపై భద్రాచలం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఇందులో మహిళా ఉద్యోగి రజిత, వెంకన్నతో పాటు విలేకరులుగా పనిచేస్తున్న రాజేష్‌, నాగచందు, ఖలీం, రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ ఆరుగురు నిందితులు కలిసి తన తండ్రిని వేధిస్తూ... ఫిర్యాదు ఉపసంహరించుకోవాలంటే రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు మృతుడి కుమార్తె అనంతుల మధులిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు భద్రాచలం సీఐ రాజు కేసు నమోదు చేశారు. అంత మొత్తం చెల్లించలేనని మానసిక ఆందోళనకు గురైన లక్ష్మీనారాయణ భద్రాచలం వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మధులిక పేర్కొన్నారు.


ఈ వార్తలూ చదవండి

వినోదంలో పెను విషాదం.. ఇంజనీరింగ్‌ కాలేజీ ఉత్సవంలో ప్రమాదం

ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. బాధితులకు సీఎం రేవంత్ భరోసా

Updated Date - Oct 19 , 2026 | 06:43 AM