Share News

భద్రాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: నేడు తిరువీధుల్లో రామయ్య ఊరేగింపు

ABN , Publish Date - Mar 20 , 2026 | 08:40 AM

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

భద్రాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: నేడు తిరువీధుల్లో రామయ్య ఊరేగింపు
Sri Rama Navami Celebrations

భద్రాచలం, మార్చి 20: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టాలకు ముందు, స్వామివారి వైభవాన్ని భక్తులకు కనువిందు చేసేలా ఆలయ అర్చకులు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు(శుక్రవారం) శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తిరు వీధుల్లో ఊరేగించనున్నారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై స్వామివారు ఊరేగింపుగా వస్తుంటే, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య భద్రాద్రి పురవీధులు పులకించనున్నాయి. భక్తులు తమ ఇంటి ముంగిటే స్వామివాని దర్శించుకునే భాగ్యం కలగనుంది. శ్రీరామనవమి వేడుకల కోసం భద్రాచలం ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యల్లో తరలివస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆ కంటి మందుకు అనుమతుల్లేవు

అయ్యో.. రామచంద్రా..!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 20 , 2026 | 09:12 AM