Share News

కేజీఎఫ్ ఆధ్వర్యంలో తమిళనాడులో కమ్మ మహానాడు..

ABN , Publish Date - Jan 30 , 2026 | 07:23 PM

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో ఫిబ్రవరి 8న కమ్మ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు KGF వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ ప్రకటించారు. ఈ మహానాడు కమ్మ సమాజ ఐక్యతకు, సంఘటిత బలానికి.. ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు..

కేజీఎఫ్ ఆధ్వర్యంలో తమిళనాడులో కమ్మ మహానాడు..

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) ఆధ్వర్యంలో తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో ఫిబ్రవరి 8న కమ్మ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు KGF వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ ప్రకటించారు. ఈ మహానాడు కమ్మ సమాజ ఐక్యతకు, సంఘటిత బలానికి.. ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కమ్మ జనాభాలో అత్యధికంగా 65 లక్షల మందికి పైగా తమిళనాడులోనే నివసిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కమ్మ సమాజ గుర్తింపును బలపరచడం, సామాజిక ఐక్యతను మరింత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


తమిళనాడులో రాజకీయంగా వెనుకబడుతున్న కమ్మవారి భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా మహానాడు నిర్వహిస్తున్నట్లు జెట్టి కుసుమ కుమార్ పేర్కొన్నారు. రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కమ్మ సమాజానికి తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ఈ మహానాడు ద్వారా డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కమ్మ సమాజంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక, సామాజికంగా చేయూతనివ్వడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. జాతీయ మీడియాను ఉద్దేశించి న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు జెట్టి కుసుమ కుమార్ తెలిపారు. ఈ మీడియా సమావేశం ద్వారా కమ్మ సమాజానికి సంబంధించిన సమస్యలు, ఆశయాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ప్రభుత్వానికి సిట్ లేఖ

నడి రోడ్డుపై వృద్ధురాలి అంత్యక్రియలు.. కారణం ఏంటంటే..

Updated Date - Jan 30 , 2026 | 07:27 PM