Share News

కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం నేటి తెలంగాణ: హరీశ్ రావు

ABN , Publish Date - Nov 29 , 2026 | 08:34 AM

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష కీలక మలుపుగా నిలిచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ పోరాట పటిమ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం నేటి తెలంగాణ: హరీశ్ రావు
Hunger Strike

సిద్దిపేట, నవంబరు 29: తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చారిత్రాత్మకమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ దీక్షాబలం, తెలంగాణ అమరవీరుల త్యాగఫలమే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమని పేర్కొన్నారు. చరిత్ర గతిని మార్చిన కేసీఆర్ నిరాహార దీక్ష తరతరాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిందని కొనియాడారు. ఆత్మబలాన్ని ఆయుధంగా, వాక్చాతుర్యాన్ని ఇంధనంగా, నిజాయితీ, నిబద్ధతలను కవచకుండలాలుగా చేసుకుని తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన యోధుడు కేసీఆర్ అని హరీశ్ రావు తన వ్యాఖ్యల్లో పేర్కొన్నారు.


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పదవులను సైతం వదులుకుని ప్రజలను ఉద్యమం వైపు ఏకం చేశారని, ప్రాణాలను ఫణంగా పెట్టి ఢిల్లీ పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించారని పేర్కొన్నారు. నిన్నైనా, నేడైనా, రేపైనా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం కీలకమనే అభిప్రాయాన్ని హరీష్ రావు తన వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 09:26 AM