Share News

జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామం.. బీఆర్ఎస్ గూటికి జీవన్ రెడ్డి

ABN , Publish Date - Apr 20 , 2026 | 07:57 PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు.

జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామం.. బీఆర్ఎస్ గూటికి జీవన్ రెడ్డి
Jeevan Reddy Joins BRS

జగిత్యాల, ఏప్రిల్ 20: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు. ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు (KCR) సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.


కేసీఆర్ సాదర స్వాగతం

జీవన్ రెడ్డికి కేసీఆర్ స్వయంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన జీవన్ రెడ్డి ప్రధాన అనుచరులు, స్థానిక నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞులైన నేత రాకతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

అఫిడవిట్లలో రూ.100 కోట్ల తేడా.. టీవీకే చీఫ్ విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు

15 ఏళ్లు తక్కువేం కాదు, ఈసారి బెంగాల్‌లో బీజేపీ పాగా... రాజ్‌నాథ్ సింగ్

Updated Date - Apr 20 , 2026 | 08:13 PM