Share News

రైలు పట్టాలపై ఆగిన లారీ.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:50 AM

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైలు పట్టాలపై ఓ లారీ ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవాళ (గురువారం) ఉదయం రైల్వే క్రాసింగ్ వద్ద ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ రైల్వే పట్టాలపై నిలిచిపోయింది. దీంతో కాజీపేట-బల్లార్ష ప్రధాన రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రైలు పట్టాలపై ఆగిన లారీ.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..
Truck Stuck on Railway Tracks

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో రైలు పట్టాలపై ఓ లారీ ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవాళ (గురువారం) ఉదయం రైల్వే క్రాసింగ్ వద్ద ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ సాంకేతిక కారణాలతో పట్టాలపై నిలిచిపోయింది. దీంతో కాజీపేట-బల్లార్ష ప్రధాన రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన గేట్‌మన్ ఈ విషయాన్ని వెంటనే రైల్వే అధికారులకు తెలియజేశారు. అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేయగా.. పెద్దపల్లి స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.


మరోవైపు రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లారీని పట్టాలపై నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. స్థానికులు కూడా లారీని పక్కకు జరిపేందుకు సహకరించారు. అయినా అది కదలకపోవడంతో ప్రత్యేక ఏర్పాట్లతో తొలగించే పనులు కొనసాగుతున్నాయి. లారీని తొలగించిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ములుగు జిల్లా మంగపేట నుంచి ఏపీలోని కాకినాడకు ధాన్యం లోడ్‌తో లారీ వెళ్తోంది. వాహనంలో ఒక్కసారిగా సమస్య తలెత్తడంతో రైల్వే గేటు దాటుతుండగా పట్టాలపై ఆగిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి

40 ఏళ్లకే కండరాలు కరిగిపోతున్నాయ్‌

ఇందరిమ్మ ఇళ్ల దరఖాస్తుకు ఆధార్‌ ఉంటే చాలు

Updated Date - Jul 23 , 2026 | 06:52 AM