కాంగ్రెస్‌కు రాజీనామాపై టి.జీవన్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడి..
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:48 AM
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు.
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అంశంపై మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి(Former MLC Jeevan Reddy) మరోసారి స్పందించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి(ABN Andhrajyothy)కి ప్రత్యేకంగా వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(MP Rahul Gandhi) విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు. 20 నెలలుగా పార్టీలో మానసిక వేదనకు గురైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
పార్టీ ఫిరాయింపుల అంశంలో రాహుల్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ప్రవర్తిస్తోందని టి.జీవన్ రెడ్డి మండిపడ్డారు. హైకమాండ్ తీరు, పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను తీసుకున్న కారణంగానే మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టార్జితమని.. పదేళ్లు తమను ఇబ్బంది పెట్టిన వారిని తీసుకువచ్చి పార్టీలో చేర్చుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయాలు జాతీయస్థాయిలో ప్రభావితం చూపబోతున్నాయని.. 'జై భీమ్-జై సంవిధాన్-జై బాపు' నినాదాలకు తూట్లు పొడిచారంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడటం బాధగా ఉన్నా తప్పడం లేదంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ అత్తాపూర్‌లో ఉద్రిక్తత.. 'ధురంధర్2' సినిమా ప్రదర్శనలో ఘర్షణ
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన..