కరీంనగర్ జ్యువెలరీ షాప్ దొంగతనం కేసులో పురోగతి.. బెంగాల్‌లో నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - May 10 , 2026 | 10:15 AM
కరీంనగర్ పీఎంజీ జ్యువెల్లరీ షాపులో భారీ దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్, మే 10: పట్టణంలో పీఎంజీ జ్యువెల్లరీ షాపులో భారీ దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తాజాగా, ఈ కేసులో కరీంనగర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు సవాలుగా మారిన ఈ కేసులో, దర్యాప్తు బృందాలు పశ్చిమ బెంగాల్‌లో ఒక నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.
దొంగతనం జరిగినప్పటి నుంచి సాంకేతిక ఆధారాలను, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రత్యేక బృందాలు.. నిందితులు పశ్చిమ బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మెరుపు దాడి చేసి ఒక దొంగను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా, దొంగిలించిన బంగారాన్ని నిందితులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో విక్రయించినట్లు గుర్తించారు. ఈ దొంగతనంలో అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సీఎం రేవంత్‌కు పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు: హరీశ్
CURE, PURE, RARE మోడల్‌తో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News