కామారెడ్డి మున్సిపాలిటీలో అక్రమాలపై విచారణ.. రికార్డుల స్వాధీనం
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:09 PM
కామారెడ్డి మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు.. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు విచారణపై దృష్టి సారించారు.
కామారెడ్డి, అక్టోబర్ 15: నగర మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు.. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు విచారణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గతంలోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా.. తాజాగా మరోసారి కీలక రికార్డులను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా అభివృద్ధి పనులకు సంబంధించిన కొలతల పుస్తకాలు (ఎంబీ రికార్డులు), బిల్లుల చెల్లింపుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో మున్సిపాలిటీలోని సంబంధిత విభాగాల్లో చర్చ మొదలైంది.
విజిలెన్స్ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్న ఎంబీ రికార్డులను తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్లోని విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను అక్కడ పరిశీలించి.. ఫిర్యాదుల్లోని అంశాలను ధ్రువీకరించే అవకాశం ఉంది.
ACB వలలో కీసర డిప్యూటీ తహసీల్దార్..
ఇదిలా ఉంటే.. తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు మరో ప్రభుత్వ అధికారి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్రెడ్డి రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్న క్రమంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపడుతున్నారు. లంచం డిమాండ్కు దారితీసిన పరిస్థితులు, ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News