International Kite Festival 2026: కైట్ ఫెస్టివల్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:53 AM
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ – 2026 జరుగనుంది. ఈ ఫెస్టివల్‌ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలు..
హైదరాబాద్, జనవరి 13: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ – 2026 జరుగనుంది. ఈ ఫెస్టివల్‌ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్‌కు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తాజాగా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పోలీసులు కీలక అడ్వైజరీ ప్రకటించారు. 13, 14, 15 తేదీల్లో పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆక్షలు విధిస్తున్నట్లు సదరు ప్రకటనలో తెలిపారు. పలు రూట్లలో ట్రాఫిక్ మళ్లిస్తుండగా.. మరికొన్ని రూట్లను పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో పరేడ్ గ్రౌండ్స్ పరిసర రహదారులను ప్రజలు వీలైనంత వరకు నివారించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ పోలీసుల అడ్వైజరీ ప్రకారం..
1. ట్రాఫిక్ మళ్లింపులు, రద్దీకి సంబంధించిన సమాచారం..
👉🏻 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అవసరాన్నిబట్టి CTO X రోడ్ – ప్లాజా X రోడ్స్ – టివోలి X రోడ్స్ మధ్య రహదారి మూసివేయడం, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు ఉంటాయి.
2. భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉన్న జంక్షన్స్..
👉🏻 CTO జంక్షన్ & ప్లాజా జంక్షన్
👉🏻 టివోలి జంక్షన్ & పికెట్ జంక్షన్
👉🏻 సికింద్రాబాద్ క్లబ్ (ఇన్-గేట్) & NCC
👉🏻 స్వీకార్ ఉపకార్, YMCA, SBI జంక్షన్లు
👉🏻 బలమ్రాయి, బ్రూక్‌బాండ్, తాడ్‌బండ్ X రోడ్స్, మస్తాన్ కేఫ్
ప్రయాణికులకు కీలక సూచన..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ (JBS)కు వెళ్లే వారు ముందుగానే బయలుదేరాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా, మీ సమయం వృథా అవకుండా ఉండేందుకు మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.
కైట్ ఫెస్టివల్-పార్కింగ్ ఏర్పాట్లు..
👉🏻 పరేడ్ గ్రౌండ్స్ వెస్ట్ గేట్-2 (లోపల) - రిజర్వ్‌డ్ (VVIPs & VIPs).
👉🏻 పరేడ్ గ్రౌండ్స్ ఈస్ట్ గేట్- ఎడమ వైపు: ఉప్పల్, టార్నాక, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వారు - ఈవెంట్ ఆర్గనైజర్లకు మాత్రమే.
👉🏻 పరేడ్ గ్రౌండ్స్ ఈస్ట్ గేట్ - కుడి వైపు: ఉప్పల్, టార్నాక, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వారు - ఈవెంట్ ఆర్గనైజర్లకు మాత్రమే.
👉🏻 జిమ్‌ఖానా ఎగ్జిబిషన్ గ్రౌండ్: పంజాగుట్ట, ట్యాంక్‌బండ్ వైపు నుంచి వచ్చే వారు - సాధారణ ప్రజల పార్కింగ్.
👉🏻 జిమ్‌ఖానా క్రికెట్ గ్రౌండ్ - పంజాగుట్ట, ట్యాంక్‌బండ్ వైపు నుంచి వచ్చే వారు - సాధారణ ప్రజల పార్కింగ్.
👉🏻 తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికార సంస్థ (SATS)- పంజాగుట్ట, ట్యాంక్‌బండ్ వైపు నుంచి వచ్చే వారు - సాధారణ ప్రజల పార్కింగ్.
👉🏻 ధోబీఘాట్ - కూకట్‌పల్లి, మెద్చల్, బోయిన్‌పల్లి వైపు నుంచి వచ్చే వారు - సాధారణ ప్రజల పార్కింగ్. (ధోబీఘాట్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ ఈస్ట్ గేట్ నెం.11కు షటిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది)
👉🏻 జిమ్‌ఖానా ఎగ్జిబిషన్ & క్రికెట్ గ్రౌండ్ మధ్య గోడల మధ్య - పోలీస్ డ్యూటీలో ఉన్నవారికి మాత్రమే పార్కింద్ సదుపాయం.
గ్రౌండ్‌లోకి ఎంట్రీ వివరాలు..
👉🏻 ధోబీఘాట్ పార్కింగ్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ ఈస్ట్ గేట్ నెం.11 వరకు షటిల్ బస్సు సేవ అందుబాటులో ఉంటుంది.
👉🏻 సాధారణ ప్రజలు వెస్ట్ గేట్ - 1, ఈస్ట్ గేట్ నెంబర్ - 11 నుంచి ప్రవేశం ఉంటుంది.
👉🏻 ఓలా / ఉబర్ / రాపిడో వినియోగదారులు పికప్ & డ్రాప్ కోసం ప్యారడైజ్ మెట్రో స్టేషన్, టివోలి జంక్షన్, SBI జంక్షన్, స్వీకార్ ఉపకార్ జంక్షన్‌లను సెలక్ట్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
మరింత సమాచారం కోసం..
ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించి మరింత సమాచారం కోసం ప్రజలు ఎమర్జెన్సీ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 8712662999 కు కాల్ చేయొచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ అడ్వైజరీని పాటించి సహకరించాలంటూ పోలసులు విజ్ఞప్తి చేశారు.
Also Read:
అమెరికాను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. ఇరాన్ అగ్రనేత వార్నింగ్..
18 యేళ్ల తర్వాత.. మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు
ప్రభుత్వ లాంఛనాలతో గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు.. సీఎం ఆదేశాలు..