Share News

Iran warning to US: అమెరికాను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. ఇరాన్ అగ్రనేత వార్నింగ్..

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:44 AM

ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటు సమస్యలతో సతమతమవుతున్న ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగు వేశారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.

Iran warning to US: అమెరికాను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. ఇరాన్ అగ్రనేత వార్నింగ్..
Iran warning to US

ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటు సమస్యలతో సతమతమవుతున్న ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగు వేశారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. ఆమెరికా జోక్యం, ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతొల్లా ఖమేనీ తాజాగా స్పందించారు. ఆమెరికాకు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు (Trump 25 percent tariff threat).


'శత్రువుల ముందు తలొగ్గేది లేదని గతంలో పలుసార్లు చాటి చెప్పాం. ఇప్పటికైనా అమెరికా మోసపూరిత చర్యలకు దూరంగా ఉండాలి. మా దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి మూకలపై ఆధారపడడం మానెయ్యాలి. ఇరాన్ చాలా బలమైన, శక్తివంతమైన దేశం. శత్రువు గురించి మాకు తెలుసు. వారిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. వారిని ఎదుర్కోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం' అని ఖమేనీ పోస్ట్ చేశారు (US Iran tensions).


ప్రజలు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇరాన్‌పై సైనిక చర్యను చేపట్టడం గురించి అమెరికా ఆలోచిస్తోంది (deceitful actions Iran). ఇరాన్‌పై వైమానిక దాడులు చేయడం ఒక ఆప్షన్‌గా ఉందని ట్రంప్ యంత్రాంగం ఇటీవల ప్రకటించింది. అలాగే ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యూఏఈ, భారత్ ముందు వరుసలో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఏడాదిలో లక్ష వీసాలు రద్దు..

Updated Date - Jan 13 , 2026 | 12:12 PM