తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ.. రాబోయే ఏడు రోజుల పాటు వర్షాలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 09:59 AM
తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల ఏడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్, జులై 9: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వారం రోజుల వాతావరణ పరిస్థితిపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దాదాపు ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం సాధారణంగా మబ్బు పట్టి ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో గాలుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్