ఫొటో కోసం అత్యుత్సాహం.. చివరికి కారు పరిస్థితి చూస్తే..
ABN , Publish Date - Jul 09 , 2026 | 07:45 AM
జమ్మూ కశ్మీర్‌లోని గురేజ్ లోయలో ఫొటోల కోసం ఆగడంతో.. పర్యాటకుల కారు ఊహించని విధంగా లోయలో పడిపోయింది. ప్రమాదానికి కొద్దిక్షణాల ముందే ప్రయాణికులంతా కిందకు దిగడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది..
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని గురేజ్ లోయ అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకుల బృందానికి ఒక చేదు అనుభవం ఎదురైంది. అక్కడి అందమైన లొకేషన్స్‌లో ఫొటోలు దిగాలనే ఉత్సాహంతో, తమ కారును వాలుగా ఉన్న ఒక కొండ రహదారిపై నిలిపారు. ప్రయాణికులందరూ వాహనం దిగి ఫొటోలు తీసుకుంటున్న సమయంలో.. ఆ కారు ఒక్కసారిగా దొర్లుకుంటూ లోయలోకి పడిపోయింది. పర్యాటకులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఆ వాహనం దొర్లుకుంటూ వెళ్లి.. చివరికి రోడ్డు పక్కన ఉన్న ప్రహరీనీ బలంగా ఢీకొట్టి కింద ఉన్న లోయలోకి పడిపోయింది. కారు లోయలోకి పడిపోతున్న దృశ్యాన్ని అక్కడున్న వారు కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వేట్రాక్‌పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్
For More Viral News And Telugu News